150 స్వచ్ఛ ఆటోలు పంపిణీ…!!

150 స్వచ్ఛ ఆటోలు పంపిణీ…!!
Views:
8

హైదరాబాద్, 22 ఫిబ్రవరి:

ఇళ్ల నుంచి చెత్తను రవాణా చేసేందుకు ఉపయోగించే స్వచ్ఛ ఆటోలను లబ్ధిదారులకు అందజేశారు. నగరంలోని నెక్లెస్‌రోడ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటికే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 2000ఆటో టిప్ప‌ర్ల‌ను పంపిణీ చేయ‌డంతో న‌గ‌రంలో చెత్త సేక‌ర‌ణ మ‌రింత పెరిగింది.

ts govt launched 150 swatch autos

ఇంటింటికి రెండు డ‌స్ట్ బిన్‌ల చొప్పున 44ల‌క్ష‌ల డ‌స్ట్ బిన్‌లు ఉచితంగా పంపిణీ చేయ‌డం, 2వేల ఆటోటిప్ప‌ర్ల‌ను అందించ‌డంతో గ‌తంలో రోజుకు 3,500 మెట్రిక్ ట‌న్నుల చెత్త సేక‌ర‌ణ‌ చేస్తున్నారు.

తాజాగా ఇప్పుడు మరో 150 పంపిణీ చేశారు. వాస్తవానికి 500 పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతానికి 150వాహనాలు సిద్ధం కావడంతో వాటిని పంపిణీ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

bonthu rammohan driving swatch auto

త్వరలోనే మిగిలిన 350 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేయనున్నట్లు, దీనికోసం ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తైనట్లు వారు పేర్కొన్నారు.

ఇప్పటికే రిక్షాలద్వారా చెత్తను తరలిస్తూ… ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు నడిపే లైసెన్సులు కలిగివున్నవారికి వీటిని పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మామాట: స్వచ్ఛ భారత్ అన్నమాట…

English Summary: telangana government launched 150 swatch autos at nickels road in which mayor bonthu rammohan, telangana CS sk. Joshi and GHMC commissioner janardhan reddy took participation.

(Visited 5 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: