Header Banner
Header Banner
TRENDING NOW

తెలంగాణ ఓటర్ల జాబితాలో రాయడానికి వీల్లేని పేర్లు!

తెలంగాణ ఓటర్ల జాబితాలో రాయడానికి వీల్లేని పేర్లు!

హైదరాబాద్, మార్చి 13,

సార్వత్రిక ఎన్నికల కోసం తెలంగాణలో అధికారులు ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఫారం-6తో నమోదైన కొత్త ఓటర్ల పేర్లతో పాటు, మార్పులు చేర్పుల అనంతరం పూర్తిస్థాయిలో జాబితాలు రూపొందిస్తున్నారు. అయితే, ఓటర్ల లిస్టును పరిశీలిస్తున్న అధికారులకు దిమ్మదిరిగిపోయేలా చిత్రమైన పేర్లు కనిపిస్తున్నాయి. ‘బాహుబలి… సన్నాఫ్ చౌగులి’ అని ఒక ఓటరు పేరుంటే, మరికొందరి పేర్లు ఇడ్లీ, యాపిల్ అని ఉన్నాయి.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

ఇవైతే ఫర్వాలేదు కానీ, మరికొన్ని పేర్లు పూర్తిగా రాయడానికి వీల్లేని భాషలో కంపరం పుట్టిస్తున్నాయి. ఆ పదాలను వినలేక అధికారులే చెవులు మూసుకునే పరిస్థితి. మొత్తమ్మీద విభిన్నంగా కనిపించిన 37 పేర్లును ఓటరు జాబితాల నుంచి తొలగించారు అధికారులు.

ఇక, ఓట్లు గల్లంతైన వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. దీనిపై తెలంగాణ సీఈఓ రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటు గల్లంతైందని ఫిర్యాదు చేశారని, వారితో పాటు మరికొందరు ప్రముఖుల ఓట్ల వివరాలను కూడా పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.

మామాట: గెలుపు-ఓటములను ఓటర్ల జాబితా నిర్ణయిస్తోంది గా…,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: