రికార్డు సృష్టించిన తెలంగాణలోని మందుబాబులు….

Telangana drunker create a new record in the state history
Share Icons:

హైదరాబాద్, 2 మే:

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా మందుబాబులు సరికొత్త రికార్డు సృష్టించారు. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం.. ఏప్రిల్ 30వ తేదీ ఒక్కరోజే మద్యం, బీర్ అమ్మకాల ద్వారా రూ. 175 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఒక్కరోజే ఇంత పెద్దమొత్తంలో తెలంగాణ ఎక్సైజ్‌కు ఆదాయం రావడం ఇదే తొలిసారి. గతంలో రూ.132 కోట్లుగా ఉన్న రికార్డ్ ఇప్పుడు రూ.175 కోట్లకు చేరటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కాగా, ఆ ఒక్కరోజే 4లక్షల 60వేల 252 కేసులు అమ్ముడయ్యాయి. ఒక్కో కేసులో 12 బీర్లు ఉంటాయి. అంటే.. మొత్తంగా 55లక్షల 83వేల 024 బీర్లు తాగారు.

ఇక రూ.24 కోట్ల విలువైన బీర్లు అమ్మకాలతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా.. రూ.22 కోట్లతో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో రెండో స్థానంలో ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా ప్రతి జిల్లాలో కనీసం రూ.5 కోట్ల విలువైన బీర్లు అమ్మకాలతో చరిత్ర సృష్టించారు మందుబాబులు. బీర్లకు రోజురోజుకు డిమాండ్ ఏర్పడటంతో.. కొరత లేకుండా చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మామాట: వీళ్ళు మంచినీళ్ళు కంటే మందే ఎక్కువ తాగినట్లున్నారు…

English summary:

Telangana drunker create a new record in the state history. On Monday, April 30, the price of alcohol and beer sales revenue is Rs. 175 crores for the state. However, this is the first time that Telangana excise in such a huge amount.

Leave a Reply