TRENDING NOW

తెలంగాణలో మందుబాబుల గగ్గోలు…. ఎందుకంటారు?

తెలంగాణలో మందుబాబుల గగ్గోలు…. ఎందుకంటారు?

హైదరాబాద్, ఆగష్టు 02,

ఏ.పీ. విభజన తరువాత ఏర్పడిన తెలంగాణ  ప్రభుత్వం భారీగా వసూలు చేస్తున్న లైసెన్స్ ఫీజులను నిరసిస్తూ తెలంగాణ డిస్టలరీల సంఘం బుధవారం నుంచి మద్యం ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో ప్రభుత్వానికి రోజూ రూ.24 కోట్లు నష్టం వస్తోంది. తెలంగాణలో మొత్తం 19 డిస్టలరీలు ఉండగా.. వీటిలో 14 డిస్టలరీలు బుధవారం మద్యం ఉత్పత్తిని నిలిపివేశాయి.  ఉమ్మడి ఏపీలో 12 బాటిళ్లు ఉన్న ఓ కేస్ ఉత్పత్తి చేస్తే డిస్టలరీ యాజమాన్యం ప్రభత్వానికి రూ.6.50 పన్ను చెల్లించవలసి వచ్చేది. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఓ కేస్ కు పన్ను రూపేణా రూ.13 వసూలు చేస్తున్నారు. దీనితో ఒక్కో డిస్టలరీ ఏటా రూ.1.56 కోట్ల లైసెన్స్ ఫీజును చెల్లించుకోవాల్సి వస్తోందని వీటి యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

treefurn AD
Life Homepathy

కాగా, పొరుగున ఉన్న ఏపీలో డిస్టలరీలు ఎంత మద్యాన్ని ఉత్పత్తి చేసుకున్నా.. ఏటా రూ.78 లక్షలు చెల్లిస్తే చాలనీ, ఇదే తరహా విధానం మహారాష్ట్ర, తమిళనాడుల్లో సైతం ఉందని చెబుతున్నాయి. లైసెన్స్ ఫీజుల్ని తగ్గించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినప్పటికీ ఎక్సైజ్ అధికారులు వినడం లేదని ఓ డిస్టలరీ యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, బుధవారం ఎక్సైజ్ మంత్రి పద్మారావుతో సంఘం ప్రతినిధులు జరిపిన చర్చలు సైతం కొలిక్కి రాకుండానే ముగిశాయి. తాజా నిర్ణయంతో తెలంగాణలో రోజుకు 80 వేల కేస్ ల మద్యం ఉత్పత్తి నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో మద్యానికి కొరత ఏర్పడుతుందేమో అని మందు బాబులు గగ్గోల పడుతున్నారు.

మామాట: తాగడానికి మంచినీరు లేకపోయినా ఫరవాలేదు మందు దొరికేటట్లు చూడండి బాబాయ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: