TRENDING NOW

వైఎస్ అభిమానుల వలనే ఓడిపోయాం: టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

వైఎస్ అభిమానుల వలనే ఓడిపోయాం: టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్, 9 జనవరి:

చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైసీపీ అధినేత జగన్ మద్దతుదారులు టీఆర్ఎస్‌కు భారీగా క్రాస్ ఓట్లు వేశారనీ, అందువల్లే ఓడిపోయామని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని, అందుకే రాహుల్ గాంధీ ఆయనతో జాతీయ స్థాయిలోనే పొత్తు పెట్టుకున్నారని అభిప్రాయపడ్డారు.

ఇక 2019 లోక్ సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని,  జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇది తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు కారణంగానే తెలంగాణలో ప్రజాకూటమి(మహాకూటమి) ఓడిపోయిందనడం సరికాదన్నారు. మెదక్ పార్లమెంటు స్థానాన్ని తన భార్యకు ఇస్తే గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ టీఆర్ఎస్ లో చేరరని, ప్రస్తుతం టీఆర్ఎస్‌లో మెజారిటీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు సంతోషంగా లేరని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు

మామాట: ఇది చాలావరకు నిజమే అనుకుంటా…

(Visited 40 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: