హస్తినలో బిజీగా ఉన్న టీ.కాంగ్రెస్ నేతలు…..

Share Icons:

ఢిల్లీ, 14 సెప్టెంబర్:

 తెలంగాణలో అన్నీ పార్టీలు ముందస్తు ఎన్నికలు హడావిడిలో ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 105 స్థానాలకి అభ్యర్ధులని ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు పొత్తు చర్చల్లో మునిగి తేలుతున్నాయి. ఇక ఇందులో భాగంగానే ఈ పొత్తు విషయమై అధిష్టానంతో చర్చేందుకు కాంగ్రెస్ నేతలు హస్తినకి వెళ్లారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితర 50 మంది నేతల వరకూ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది.

వీరంతా మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై, పొత్తుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీకి ఎన్ని సీట్లు కేటాయించాలి? ఇతర కలిసొచ్చే పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి? ఎక్కడ ఎవరు పోటీ పడాలి? తదితర విషయాలపై రాహుల్‌తో చర్చించనున్నారు. అలాగే ఈ పొత్తు గురించి తమ ఆలోచనలను అధినాయకుడుకి వివరించి.. ఆయన సలహా, సూచనలు తీసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సమావేశంలోనే సినీ నిర్మాత బండ్ల గణేష్, భూపతిరెడ్డి తదితరులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

మామాట: ఇప్పటికైనా పొత్తు చర్చలు ముగుస్తాయో లేదో?

Leave a Reply