బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒప్పందం ప్రకారమే ముందస్తు..

Share Icons:

ఢిల్లీ, 6 సెప్టెంబర్:

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒప్పందం ప్రకారమే ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని, ఎన్నికలకు కాంగ్రెస్ భయపడటం లేదని తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఖుంతియా స్పష్టం చేశారు. కేసీఆర్ ముందస్తు ప్రకటనపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు తీర్పునిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థాంతరంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు.

అలాగే కేసీఆర్‌ది నియంతృత్వ ధోరణి అని, ముందస్తుకు వెళ్తున్నానని ప్రకటించిన కేసీఆర్‌… తన ఓటమిని తానే ఒప్పుకున్నారని ఆయన అన్నారు. ఎవరి కోసం ఈ ముందస్తు ఎన్నికలని, కేసీఆర్‌ కుటుంబం కోసమా?…తెలంగాణ కోసమా? అంటూ ఆయన ప్రశ్నించారు.

అయితే ముందస్తు ఎన్నికలు వస్తే కోడ్‌ అమలులో ఉంటుందని, కొత్త పనులు ఏమీ జరగవని, అలాగే తెలంగాణలో ఎన్నికలయ్యాక… మోదీ ఎన్నికలకు వెళ్తారని, అప్పుడు మళ్లీ ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని, దీంతో తెలంగాణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఖుంతియా అన్నారు.

ఇక మరో సందర్భంలో ఎన్నికల హామీలు నెరవేర్చలేకనే కేసీఆర్‌ ముందస్తు డ్రామా ఆడుతున్నారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ప్రజావ్యతిరేకతను తప్పించుకునేందుకు అసెంబ్లీ రద్దు చేశారని, తనని మాజీని చేసిన ప్రభుత్వమే రద్దు కావడం సంతోషంగా ఉందని చెప్పారు.

మామాట: అసలు ముందస్తు అంటే మీరు భయపడుతున్నట్లున్నారు……

Leave a Reply