రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయనున్న తెలంగాణ…

Share Icons:

హైదరాబాద్, 10 జూలై:

పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్ 50 శాతం దాటొద్దని హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించేలా పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా కోరాలని సీఎం నిర్ణయించారు.

ఈ మేరకు అవసరమైన కసరత్తు చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బుధవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావాలని ఆదేశించారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్‌తో పాటు ఇతర సంబంధిత అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచి అన్ని విషయాలను సవివరంగా చర్చించాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని చెప్పారు.

మామాట: మరి సుప్రీం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో?

Leave a Reply