“నన్ను తిట్టినన్ని తిట్లు ఎవరినీ తిట్టి ఉండరు” -కేసీఆర్!

Share Icons:
  • తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో విధాలుగా అవహేళన చేశారు
  • ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రభుత్వ పథకాలను అమలు చేస్తాం
  • కౌశిక్ రెడ్డి పార్టీ లో చేరిన సందర్భం

తెలంగాణ ఉద్యమ సమయంలో తనను ఎన్నో విధాలుగా అవహేళన చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తన శరీర భాగాలను కూడా కించపరుస్తూ కామెంట్లు చేశారని… అయినా తాను భయపడలేదని, వెనకడుగు వేయలేదని చెప్పారు. ఎవరేమనుకున్నా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటే మఠం కాదని… ఇదొక రాజకీయ పార్టీ అని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారనే విమర్శలకు సమాధానంగా… ఎన్నికల్లో లబ్ధి కోసం కచ్చితంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలవలేని పార్టీలే హామీలు ఇస్తుంటే… గెలిచే పార్టీ అయిన మేము ఎందుకు ఇవ్వమని అన్నారు. కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి ఈరోజు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • టీఆర్ఎస్ లో  కౌశిక్ రెడ్డి
  • కౌశిక్ రెడ్డికి గులాబీ కండువా
  • కౌశిక్ కు ఉజ్వల భవిష్యత్తు
  • కౌశిక్ తండ్రి  చిరకాల మిత్రుడని వ్యాఖ్య

 

కేసీఆర్ మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి సాయినాథ్ రెడ్డి పని చేశారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఆకాంక్షతోనే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు గెలవడం, ఓడిపోవడం నిరంతర ప్రక్రియ అని అన్నారు. శాశ్వతంగా ఏ పార్టీ కూడా అధికారంలో ఉండదని,. ఎప్పుడూ అధికారంలో ఉండటానికి రాచరిక వ్యవస్థ కాదని అన్నారు. టీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ తెలిపారు. కౌశిక్ ను ఎవరూ ఆపలేరని… ఆయన ఉన్నతికి తాను హామీ ఇస్తున్నానని చెప్పారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply