అందుకేనా హరీష్ రావుకు ఆర్ధికం అప్పజెప్పారు…!

many plans to gave finance ministry to harish rao
Share Icons:

హైదరాబాద్:

తెలంగాణ సీఎం కేసీఆర్ హఠాత్తుగా  రెండోసారి కేబినెట్ విస్తరణ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 12 మందితో మంత్రివర్గ విస్తరణ చేసిన కేసీఆర్…ఆదివారం మరో ఆరుగురుతో కేబినెట్ విస్తరణ చేశారు. ఇందులోకి కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ లకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇక వీరికి నిన్ననే శాఖలు కేటాయించేశారు. హరీశ్ రావుకు ఆర్థిక శాఖ కేటాయించారు. కేటీఆర్‌కు మున్సిపల్ – ఐటీ,పరిశ్రమలు శాఖ, సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ, గంగుల కమలాకర్‌కు బీసీ సంక్షేమం- పౌర సరఫరాలు, సత్యవతి రాథోడ్‌కు గిరిజన – మహిళా సంక్షేమం, పువ్వాడ అజయ్‌కు రవాణా శాఖను కేటాయించారు.

ఇప్పటి వరకు ప్రశాంత్ రెడ్డి  నిర్వహిస్తున్న రవాణా శాఖను అజయ్‌కు కేటాయించారు. జగదీష్ రెడ్డి నిర్వహిస్తున్న విద్యా శాఖను సబితా ఇంద్రారెడ్డికి అప్పగించారు. విద్యుత్ శాఖను జగదీష్ రెడ్డికి కేటాయించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ హరీష్ రావుని దూరం పెడుతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి పదవి కూడా దక్కదని ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా నిన్న విస్తరణలో హరీష్ రావుకు అవకాశమిచ్చారు. అలాగే కేబినెట్ లో అతి పెద్ద పదవి ఆర్ధిక శాఖని హరీష్ కు కట్టబెట్టారు.

అయితే ఉన్నపళంగా హరీష్ కు ఆర్ధిక శాఖ ఇవ్వడానికి పెద్ద కారణమే ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆర్థిక మాంద్యం తరుముకొస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నెత్తికెత్తుకున్న తరుణంలో ఆర్ధిక పరిస్థితిని సరిదిద్దాడానికి హరీష్ కు అవకాశం లభించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్నప్పటికీ అనేక బిల్లుల చెల్లింపులో విపరీత జాప్యం తప్పడం లేదు. సీఎం కేసీఆర్‌కు సమాచారం లేకుండా ఆర్థిక శాఖ నుంచి ఏ బిల్లునూ చెల్లించకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ పరిణామాల మధ్య హరీశ్‌కు ఆర్థిక శాఖను కేటాయించటం గమనార్హం. ఆర్థికం అప్పగించడం ట్రబుల్‌ షూటర్‌గా ఆయన సేవలను ఉపయోగించుకోవడానికే అని ఓ వైపు చర్చ జరుగుతుంటే…మరోవైపు మంత్రిగా చోటు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండని శాఖ ఇచ్చి సరిపుచ్చుతున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది.

అటు కేటీఆర్ కు కూడా మంత్రి పదవి దక్కడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కవితకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అలా కానీ పక్షంలో రాజ్యసభ కూడా ఇవ్వొచ్చని తెలుస్తోంది. మరి చూడాలి కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తారో.

 

Leave a Reply