జగన్ నిర్ణయానికి జై కొట్టిన బీజేపీ నేత…

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

హైదరాబాద్: ఏపీలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యపాన నిషేధాన్ని తెలంగాణ బీజేపీ నాయకురాలు డి‌కే అరుణ సమర్ధించారు.  మద్య నిషేధం వైపు ఏపీ ప్రభుత్వం అడుగులు వేయడం మంచి పరిణామమని, తెలంగాణలో కూడా మద్యాన్ని నిషేధించేందుకు సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారుల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించాలని సూచించారు.

దిశ, మానస, సమతలపై అత్యాచారాలకు మద్యమే కారణమని డీకే అరుణ అన్నారు. మద్యం వల్ల అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో బెల్టు షాపులు పెరిగిపోతున్నా కేసీఆర్ కు కనిపించడం లేదని విమర్శించారు. ఉద్యమం సమయంలో చెప్పిన మాటలను కేసీఆర్ మర్చిపోయారని అన్నారు. యువతను పెడదారి పట్టిస్తున్న పబ్ లు, క్లబ్ లను నిషేధించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు

తెలంగాణలో దిశ హత్య తర్వాత మద్యంపై చర్చ సాగుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి డీకే అరుణ చేపట్టిన మహిళా సంకల్ప దీక్షకు లక్ష్మణ్ మద్దతు పలుకుతూ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలను తూర్పారబట్టారు. హైదరాబాద్ బ్రాండ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘బ్రాందీ’ హైదరాబాద్ గా మార్చారని విమర్శించారు. బీజేపీ మహిళా సంకల్ప దీక్షతో ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని పేర్కొన్నారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఏ తల్లి కడుపుకోతకు మద్యం కారణం కాకూడదన్నారు.

సీఎం కేసీఆర్ సామాజిక బాధ్యతను గుర్తెరిగి మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.  రాజకీయ ప్రయోజనాలకోసం దీక్ష చేయడంలేదని చెప్పారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలను నిరోధించేందుకే తాము సంకల్ప దీక్ష చేపట్టామన్నారు. ఈ దీక్షతో.. తమ ఉద్యమం ఆగదన్నారు. మద్య నిషేధం కోరుతూ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని అన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు.

 

Leave a Reply