అందుకే ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్న….

Share Icons:

హైదరాబాద్, 13 మే:

ఎన్టీఆర్ బయోపిక్‌కి తొలుత తేజను దర్శకుడిగా తీసుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైన తొలినాళ్లలోనే తేజ, ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇక తాజాగా బయోపిక్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో తేజ చెప్పారు.

ఎన్టీఆర్ చరిత్ర లోతుల్లోకి వెళ్లిన తరువాత, తానైతే ఆయనకు న్యాయం చేయలేనని అనిపించిందని, అందువల్లే దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నానని చెప్పారు. అంతేగానీ బాలకృష్ణతో గొడవలేమీ రాలేదని అన్నారు. తను ఏ అభిప్రాయాన్ని అయినా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్టు చెబుతానని అందుకే … తాను, ఎందుకొచ్చిన గోలని ఎన్టీఆర్ బయోపిక్ తిలకించలేదని స్పష్టం చేశారు. 

కాకపోతే తాను చేసుంటే సినిమా ఇంకా బాగా వచ్చుండేదన్న కామెంట్లు వచ్చాయని తేజ వ్యాఖ్యానించారు. అటువంటి కామెంట్లను తాను పట్టించుకోలేదని అన్నారు.

మామాట: మొత్తానికి ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు…

Leave a Reply