రక్షణదళాల్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ జాబ్స్

Share Icons:

కొత్త ఢిల్లీ, జూన్ 03,

ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్) ఖాళీల భర్తీకి భారత వైమానిక దళం ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్) నిర్వహిస్తోంది. వివిధ విభాగాల్లో‌ని ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాల్లో ఎంపిక కోసం గ్రాడ్యుయేట్లు పోటీ పడొచ్చు.. పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపిన వారు నేరుగా ఫ్లయింగ్ ఆఫీసర్, సబ్ లెఫ్టినెంట్ హోదాలు దక్కించుకోచ్చు. ఇందులో ఏ ఉద్యోగానికి ఎంపికైన కూడా మొదట్నుంచే లక్ష రూపాయల జీతం అందుకోవచ్చు.

ఫ్లయింగ్ బ్రాంచ్ :

ఈ విభాంలోని పోస్టులకోసం 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. అదేవిధంగా.. ఇంటర్ / ప్లస్ 2 లో మ్యాథ్స్, ఫిజిక్స్ కచ్చితంగా ఉండాలి. జులై 1,2020 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు కనీసం 162.5 సెం.మీ తప్పనిసరి.

గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ :

ఏరోనాటికల్ ఇంజినీర్( ఎలక్ట్రానిక్స్/మెకానికల్) పోస్టులకు 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో బీటెక్/బీఈ పూర్తి చేసినవారు అర్హులు. ఇంటర్/+2 లో ఫిజిక్స్, మ్యాథ్స్2ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

 గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ :

అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ విభాగులున్నాయి. 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసినవారు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కుల ఉత్తీర్ణతతో పాటు ఎంపిక చేసిన పీజీ కోర్సుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఎడ్యుకేషన్ విభాగం పోస్టులకు అర్హులు.

వయసు : గ్రౌండ్ డ్యూటీలోని టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్ని పోస్టులకు కూడా జులై 1, 2020 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు వయసున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ : ఈ విభాగానికి ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ సి సర్టిఫికెట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రితో పాటు 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లోనూ 60 శాతం ఉండాలి.

మెటీరియాలజీ : 50 శాతం మార్కులతో ఏదైనా పీజీ ఉత్తీర్ణత. అలాగే యూజీలో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో 55 శాతం మార్కులు తప్పనిసరి..

ఎంపిక : పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌ల ద్వారా

ఖాళీలు : 251

చివరితేదీ : జూన్ 30

ఆన్‌లైన్ పరీక్ష తేదీలు : ఆగస్టు 24, 25

వెబ్‌సైట్ : https://afcat.cdac.in

Leave a Reply