రెండో టీ20కూడా కొట్టేశారు…సిరీస్ పట్టేశారు…

team india won the second t20 match and won the series
Share Icons:

ఫ్లోరిడా:

 

ప్రపంచ కప్ సెమీస్ నుంచి ఇంటి ముఖం పట్టిన టీమిండియా…వెస్టిండీస్ పర్యటనలో అదరగొడుతుంది. మొన్న ప్రారంభమైన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లని గెలుచుకుని సిరీస్ సొంతం చేసుకున్నారు. మొదటి మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో గెలుచుకున్న టీమిండియా ఆదివారం ఇక్కడ జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం 22 పరుగుల తేడాతో గెలుపొందింది.

 

మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (51 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స ర్లు) అర్ధశతకం సాధించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (28; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో థామస్, కాట్రె ల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్ 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 98 పరుగులు చేసింది.

 

అయితే విజయానికి 27 బంతుల్లో 70 పరుగులు చేయాల్సిన దశలో వాతావరణం అనుకూలించకపోవడంతో డకవర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్‌ను విజేతగా తేల్చారు. ఆట నిలిచే సమయానికి విండీస్ విజయానికి 120 పరుగులు చేయాల్సి ఉండగా.. 98కే పరిమితమవడంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. రావ్‌మన్ పావెల్ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. భారత బౌలర్లలో కృనాల్ పాండ్యా 2 వికెట్లు, భువనేశ్వర్, సుందర్ తలో వికెట్ పడగొట్టాడు.

 

Leave a Reply