రెండో టెస్టుకు టీమిండియా సిద్దం

Share Icons:

 హైదరాబాద్, అక్టోబర్ 11,

భారత్- వెస్టిండీస్ ల మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. కాగా, రెండో టెస్టుకు సంబంధించి 12 మంది ఆటగాళ్లతో కూడిన టీమిండియా జాబితాను బీసీసీఐ గురువారం ప్రకటించింది. జాబితాలో ఒక మార్పు చోటుచేసుకోవడం విశేషం. మొహమ్మద్ సిరాజ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ కు అవకాశం కల్పించారు. పిచ్ పరిస్థితి చూస్తే తొలి మ్యాచ్ లో ఉన్న 11 మంది ఆటగాళ్లే రెండో టెస్టులో ఆడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ లకు తొలి టెస్టులో ఆడే అవకాశం లభించలేదు. రెండో టెస్టు తుది జాబితా నుంచి కూడా వారిని పక్కన పెట్టేశారు.

కాగా, రాజ్ కోట్ లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ టెస్ట్ లో వెస్టిండీస్ పై భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో  జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. 

తాజాగా బిసిసిఐ విడుదల చేసిన టీమిండియా ఆటగాళ్ల తుది జాబితా:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, పృథ్వీ షా, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్.

 

మామాట: ఈ మ్యాచ్ లో కూడా యువ ఆటగాళ్లు మెరుస్తారా.. 

Leave a Reply