టెస్ట్ చాంపియన్‌షిప్‌ కు సిద్ధమైన టీమిండియా…విండీస్ తో తొలి టెస్ట్

team india vs west indies test match
Share Icons:

గయానా:

 

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే యాషెస్ టెస్ట్ సిరీస్ తో వరల్డ్ చాంపియన్ షిప్ పోటీ మొదలైన విషయం తెల్సిందే. టెస్ట్ హోదా కలిగిన జట్లు 2021 వరకు ఆడే టెస్టుల్లో ఎవరైతే టాప్ 2 లో ఉంటారో ఆ జట్ల మధ్య చాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఇక చాంపియన్ షిప్ లో భాగంగా టీమిండియా తన మొదటి టెస్ట్ ని వెస్టిండీస్ తో మొదలుపెట్టనుంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారమిక్కడి సర్ వివ్ రిచర్డ్స్ మైదానంలో భారత్-విండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

 

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కరీబియన్ జట్టు కంటే బలంగా ఉన్న కోహ్లీసేనకు తుదిజట్టు కూర్పే పెద్ద సవాల్‌గా మారింది. మరోవైపు పిచ్ పేస్‌కు అనుకూలించేలా ఉన్న తరుణంలో రోచ్, గాబ్రియేల్‌తో కూడిన విండీస్ బౌలింగ్ భీకరంగా ఉంది. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ గెలిచి షాకిచ్చిన హోల్డర్ సేన… సొంతగడ్డపై ఎదురైన టీ20, వన్డే సిరీస్‌ల పరాభవంతో కసిగానే ఉంది.

 

తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా రావడం దాదాపు ఖాయమే. అయితే, తెలుగు ప్లేయర్ విహారీ కూడా పోటీలో ఉన్నాడు. ఆ తర్వాత మూడో స్థానంలో మిస్టర్ డిపెండబుల్ చతేశ్వర్ పుజారా, నాలుగో స్థానంలో కెప్టెన్ కోహ్లీ రంగ ప్రవేశం చేస్తారు. ఇక ఐదో స్థానం కోసం ఎవరిని తీసుకోవాలనే విషయంపైనే చర్చంతా నడుస్తున్నది. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాల్సి వస్తే సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ… వైస్ కెప్టెన్ అంజిక్య రహానేల్లో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేయాల్సి వస్తుంది. నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే ఇద్దరికీ చోటుంటుంది.

 

వికెట్ కీపర్ స్థానానికి సీనియర్ ప్లేయర్ వృద్ధిమాన్ సాహా, యువ ఆటగాడు రిషభ్ పంత్ మధ్య పోటీ ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ బౌలింగ్‌ను నడిపించనున్నారు. మూడో పేసర్‌గా ఇషాంత్‌కే ఎక్కువ అవకాశాలుండగా.. ఉమేశ్ బెంచ్‌కు పరిమితమవ్వొచ్చు. ఇక స్పిన్ విభాగంలో సీనియర్ రవిచంద్రన్ అశ్విన్, స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఒకరే ఉండే చాన్స్ ఉంది.

Leave a Reply