ఆసియా కప్‌కి సిద్ధమవుతున్న టీమిండియా…

team india reached dubai for asia cup
Share Icons:

దుబాయ్, 14 సెప్టెంబర్:

సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనను ముగించుకున్న టీమిండియా మరో పోరాటానికి సిద్ధమైంది. రేపటి నుండి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో తలపడే భారత జట్టు గురువారం సాయంత్రం దుబాయ్ వెళ్లింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతిని ఇవ్వడంతో భారత జట్టుకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు.

మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్ దుబాయ్ చేరిన వారిలో ఉన్నారు.

ఇక ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాల్గొన్న కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్, శార్దుల్ ఠాకూర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి, కోచింగ్ సిబ్బంది సెప్టెంబర్ 16న రోహిత్‌సేనతో కలవనున్నారు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో భారత జట్టు ప్రాక్టీస్ చేయనుంది.

కాగా, రేపు శ్రీలంక-బంగ్లాదేశ్‌ల మధ్య జరగబోయే మ్యాచ్‌తో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఇక భారత్ 18న హాంకాంగ్‌తో, 19న పాకిస్థాన్‌తో తలపడనుంది.

మామాట: ఆసియా కప్‌లో భారత్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో

Leave a Reply