మూడో టీ20లో రికార్డుల మోత మోగించిన కోహ్లీసేన…

team india new records in third t20 match
Share Icons:

ముంబై: మొదట టీ20లో టీమిండియా విజయం సాధిస్తే….రెండో టీ20లో విండీస్ అదిరిపోయే విజయం అందుకుంది. దీంతో సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20లో అదిరిపోయే పోటీ జరిగింది. ఈ పోటీలో టీమిండియా పై చేయి సాధించి సూపర్ విక్టరీ కొట్టి సిరీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.  బుధవారం పరుగుల హోరు మధ్య సాగిన పోరులో కోహ్లీసేన 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. తొలుత కేఎల్‌ రాహుల్‌(56 బంతుల్లో 91, 9 ఫోర్లు, 4సిక్స్‌లు), రోహిత్‌(34 బంతుల్లో 71, 6ఫోర్లు, 5 సిక్స్‌లు), కోహ్లీ(29 బంతుల్లో 70 నాటౌట్‌, 4ఫోర్లు, 7 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగులు చేసింది.

కాట్రెల్‌, విలియమ్స్‌, పొలార్డ్‌ ఒక్కో వికెట్‌ దక్కాయి. లక్ష్యఛేదనలో చాహర్‌(2/20), భువనేశ్వర్‌(2/41), షమీ(2/25), కుల్దీప్‌(2/45) ధాటికి విండీస్‌ 8 వికెట్లకు 173 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్‌ పొలార్డ్‌(39 బంతుల్లో 68, 5ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధసెంచరీతో పోరాడినా లాభం లేకపోయింది. హిట్‌మైర్‌(41) ఆకట్టుకున్నాడు. రాహుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ దక్కాయి. ఇక మూడు వన్డేల్లో భాగంగా ఆదివారం టీమిండియా-వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి వన్డే జరగనుంది.

అయితే మూడు టీ20 మ్యాచ్ లో టీమిండియా రికార్డుల మోత మోగించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400ల సిక్స్‌ల మైలురాయి అందుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అత్యధిక సిక్స్‌ల జాబితాలో గేల్‌ (534), షాహిద్‌ అఫ్రిదీ (476) తర్వాత రోహిత్‌ మూడో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీకి ఇది ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ (21 బంతుల్లో).ఓవరాల్‌గా భారత్‌ తరఫున ఐదోదిగా నమోదైంది.

ఇక స్వదేశంలో టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన భారత తొలి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. అంతకముందు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్(1430), కోలిన్ మున్రో(1000) ఈ ఘనత సాధించారు. సొంతగడ్డపై విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 29 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ పరుగులు సాధించాడు. వాంఖడేలో ఇదే (240/3) అత్యధిక స్కోరు. గతంలో ఇక్కడ 2016 టీ20 వరల్డ్‌క్‌పలో సౌతాఫ్రికాపై ఇంగ్లండ్‌ 230 స్కోరు చేసింది.

Leave a Reply