పొరాడి ఓడిన భారత్…

Share Icons:

బ్రిస్బేన్, 21 నవంబర్:

మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ-20లో టీమిండియా పరాజయం పాలైంది. 17 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బరిలో దిగిన కోహ్లీ సేన నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 169/7 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.

రోహిత్(7), రాహుల్(13), కోహ్లీ(4) విఫలమైన ధావన్(76), కార్తీక్(30) పొరాడి ఆడటంతో గెలుపు దగ్గర వరకు వచ్చారు. అయితే లాస్ట్ ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి వచ్చిన తరుణంలో అందరూ భారత్‌దే గెలుపు అనుకున్నారు. కానీ అనూహ్యంగా కృనాల్ పాండ్య, కార్తీక్ వెంటవెంటనే ఔట్ అవ్వడంతో ఆసీస్ విజయం ఖాయమైంది. ఆసీస్ బౌలర్లలో స్టాయినిస్ 2, జంపా 2 వికెట్లతో రాణించారు.

ఇక అంతకముందు వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ లక్ష్యాన్ని 174 పరుగులకు సవరించారు. మ్యాక్స్‌వెల్ 24 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అందులో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. స్టాయినిస్ 19 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. లిన్, (37), ఫించ్ (27) రాణించారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ భారీ షాట్లతో టీమిండియా బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా తన 4 ఓవర్ల కోటాలో 55 పరుగులు ఇవ్వగా.. ఖలీల్ అహ్మద్ 3 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు. కుల్‌దీప్ యాదవ్ మాత్రమే 4 ఓవర్లలో కేవలం 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. కీల‌క స‌మ‌యంలో రెండు క్యాచ్‌లు డ్రాప్ చేయ‌డం కూడా ఆస్ట్రేలియా భారీ స్కోరు బాట‌లు వేసింది.

ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ-20 శుక్రవారం జరగనుంది

మామాట: మొత్తానికి గెలుపు దగ్గర వరకు వచ్చి ఆగిపోయారు.

Leave a Reply