హెడ్ కోచ్ గా మళ్ళీ రవిశాస్త్రి ఎంపిక…

Share Icons:

ముంబై:

 

అంతా అనుకున్నట్లే జరిగింది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి రవిశాస్త్రి తిరిగి ఎంపికయ్యారు.  కోచ్ పదవి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆరుగురిని ఇంటర్వ్యూకు పిలిచిన కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) చివరికి రవిశాస్త్రి వైపే మొగ్గుచూపింది. 2021 ఐసీసీ వరల్డ్ టీ20 వరకు రెండేళ్ల పాటు అతడు ఈ పదవిలో కొనసాగనున్నాడు.

 

బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్వ్యూకు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫిల్ సిమ్మన్స్ వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాకపోగా.. మిగిలిన ఐదుగురి ప్రణాళికలను క్షుణ్ణంగా పరిశీలించిన సీఏసీ చివరకు రవిశాస్త్రికే పట్టం కట్టింది. అనుభవం, గతంలో సాధించిన ఘనతలు, కోచింగ్ నైపుణ్యం, భావ వ్యక్తీకరణ, ఆధునిక సాధనాల పరిజ్ఞానం అనే ఐదు అంశాల ఆధారంగా ఈ ఎంపిక చేపట్టినట్లు కమిటీ సభ్యులు శాంతా రంగస్వామి, అన్షుమన్ గైక్వాడ్ స్పష్టం చేశారు.

 

ప్రతి అంశానికి నాలుగు గ్రేడ్‌లు (వెరీగుడ్ 20, గుడ్-15, యావరేజ్-10, పూర్-5)గా మార్కులు కేటాయిస్తూ.. చివరకు వాటన్నింటిని కలిపి అగ్రస్థానంలో నిలిచిన వారిని అత్యంత పారదర్శక పద్ధతిలో ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. కోచ్ స్థానం కోసం నిర్వహించిన ఈ రేసులో తీవ్ర పోటీ నడిచింది. మూడో స్థానంలో టామ్ మూడి, రెండో స్థానంలో మైక్ హెస్సన్ నిలువగా.. శాస్త్రికే టాప్ ప్లేస్ దక్కింది

 

Leave a Reply