ఇంగ్లండ్‌కి బయల్దేరిన టీమిండియా…

Share Icons:

ముంబై, 22 మే:

మే 30 నుంచి మొదలయ్యే వన్డే క్రికెట్ సమరానికి టీమిండియా సిద్ధమైంది. ఇంగ్లండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌కి భారత జట్టు బయలుదేరి వెళ్లింది. కోహ్లీ నేతృత్వంలోని భారత్ టీమ్, ఈ తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్టు నుంచి లండన్ కు పయనం అయ్యారు.

కాగా, విమానాశ్రయంలో వీరు దిగిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది. గెలుపే లక్ష్యంగా టీమిండియా లండన్ కు బయలుదేరి వెళ్లగా, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

అటు తాము స్వయంగా తీసుకున్న చిత్రాలను రోహిత్ శర్మ, బుమ్రా, పాండ్యా తదితరులు కూడా అభిమానులతో  పంచుకున్నారు. ఈ నెల 30 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా, జూన్ 5న సౌతాఫ్రికాతో ఇండియా తన తొలి మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ కూడా తమకు కీలకమేనని, తొలి మ్యాచ్ నుంచే టాప్ గేర్ లో వెళతామని కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

మామాట: టీమిండియాకి ఆల్ ది బెస్ట్….

Leave a Reply