వెస్టిండీస్ టూరుకు వెళ్లే భారతజట్టు ఇదే…..ధావన్ ఈజ్ బ్యాక్…..

World cup 2019- Team India
Share Icons:

ముంబై:

ప్రపంచ కప్ లో సెమీస్ నుంచే వెనుదిరిగిన టీమిండియా ఆగస్టు లో వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విండీస్ టూరుకు వెళ్లే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విండీస్ టూర్‌లో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

టెస్టు జట్టులో తెలుగు కుర్రాడు హనుమ విహారీకి చోటు దక్కింది. టెస్టు టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానేను ఎంపిక చేశారు. వన్డే , టీ20 జట్లకు రోహిత్ ని వైస్ కెప్టెన్ గా నియమించారు. ఇక గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమైన శిఖర్ ధావన్‌ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. వన్డే, టీ20 రెండు ఫార్మాట్లకు శిఖర్ ధావన్ ఎంపికయ్యాడు. ధోనీ ఈ టూర్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ధోనీ స్థానంలో పంత్ వచ్చాడు.

టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, సి. పుజారా, హనుమ విహారీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వర్ధమాన్ సాహా(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్

వన్డే జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనిష్ పాండే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, యజువేంద్ర ఛాహల్, కేదార్ జాదవ్, మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ

టీ20 జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, కృణాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ

Leave a Reply