ధోని ఎటూ వెళ్లటం లేదు..

Share Icons:

ఢిల్లీ, 19 జూలై:

టీమిండియా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ని 2-1 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే చివరిదైనా మూడో వన్డే ముగిశాక ఆటగాళ్లందరు మైదానాన్ని వీడుతున్న సమయంలో మహేంద్ర సింగ్‌ ధోని.. అంపైర్లను అడిగి మరి బంతి తీసుకున్నాడు. అలాగే తన కీపింగ్ గ్లౌస్‌ని కూడా అభిమానులకి ఇచ్చాడని తెలుస్తోంది.

దీంతో ఈ జార్ఖండ్‌ డైనమెట్‌ క్రికెట్‌కి గుడ్ ‌బై చెప్పేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ విషయమై అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2014లో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించే సందర్భంలోనూ అంపైర్ల నుంచి వికెట్‌ తీసుకున్న సంఘటనని గుర్తు చేసుకుని మరి బాధపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ధోని రిటైర్మెంట్‌ వదంతులపై కోచ్ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధోని ఎటూ వెళ్లటం లేదని, టీమిండియాతో అతడు ఇంకొంత కాలం ప్రయాణిస్తాడని చెప్పుకొచ్చారు. బంతిని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు చూపించడానికే తీసుకున్నాడని, మ్యాచ్‌లో బంతితో పడిన ఇబ్బందుల గురించి చెప్పడానికి ఒక జనరల్‌ ఐడియా కోసం తీసకున్నాడే తప్పా ఏ రిటైర్మెం‍ట్‌ ఉద్దేశం లేదని రవిశాస్త్రి వివరణ ఇచ్చారు.

ఇది ఇలా ఉంటే వచ్చే వరల్డ్‌ కప్‌ జట్టులో ధోని ఉండాలని యాజమాన్యం భావిస్తే అతను ఆటతీరు మార్చుకోక తప్పదని మాజీ కెప్టెన్‌ గంగూలీ సూచించాడు.

మామాట: గంగూలీ చెప్పింది పాటిస్తే సరిపోతుంది….

Leave a Reply