TRENDING NOW

విశాఖ లోక్‌సభకి పోటీ చేసే టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు వీరేనా…?

విశాఖ లోక్‌సభకి పోటీ చేసే టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు వీరేనా…?

విశాఖపట్నం, 5 ఆగష్టు:

విశాఖపట్నం…. హైదరాబాద్ కంటే ముందే గ్రేటర్ హోదా పొందిన నగరం… సుందరమైన సముద్ర తీరం, ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే అంతా ప్రశాంతంగా ఉండే విశాఖ నగరం ఇప్పుడు తాజా రాజకీయాలతో వేడెక్కుతుంది.

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలోనే అతి పెద్ద నగరమైన విశాఖ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఏపీలో మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలతో పోల్చితే ఇది విభిన్నంగా ఉంటుంది. ఇతర ప్రాంతాలకు చెందినవారే ఇక్కడ ఎక్కువ గెలుస్తున్నారు. ఇక స్థానికులు ప్రాతినిధ్యం వహించిన సందర్భాలు తక్కువే.

Life Homepathy
treefurn AD

ఇప్పటివరకు ఇక్కడ గెలిచిన సుబ్బరామిరెడ్డి, ఎంవీవీఎస్ మూర్తి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, దగ్గుపాటి పురంధేశ్వరి, అంతా ఇతర జిల్లాలకు చెందిన నాయకులే. కానీ 2014లో మాత్రం నుంచి ఇక్కడ కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలకి స్థానికులకే పట్టం కట్టాలన్న భావన పెరిగినట్లు అనిపిస్తోంది.

అందుకనే 2014లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ సీఎం, దివంగత వైఎస్ సతీమణి విజయలక్ష్మిని ప్రజలు తిరస్కరించారు. టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి కంభంపాటి హరిబాబు విజయం సాధించారు. అయితే స్థానికత అంశమే విజయలక్ష్మి ఓటమికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే హరిబాబు కూడా ఇతర ప్రాంతానికి చెందిన వ్యక్తే అయినా, దశాబ్ధాల క్రితం ఇక్కడకు వచ్చి స్థిర పడ్డారు. ఇదే ఆయనకు ప్లస్ అయి, విజయమ్మకు మైనస్‌గా మారిందని చెబుతుంటారు. ఇక 2014 అనుభవం దృష్ట్యా 2019లో పోటీ చేసే అభ్యర్ధులపై టీడీపీ, వైసీపీ పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

వైసీపీ తరుపున నిలబడేదెవరో?

వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విశాఖ లోక్‌సభ నుంచి పోటీచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకు వైసీపీ అధినేత కూడా సుముఖంగానే ఉన్నారు. అందుకే విశాఖలో పార్టీ తరుపున ఎలాంటి కార్యక్రమాలు ఉన్న ఆయన క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. కానీ 2014 అనుభవం దృష్టిలో పెట్టుకుంటే విజయసాయి వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే ప్రస్తుతం నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఉన్న స్థానికుడు ఎంవీపీ బిల్డర్స్ అధినేత సత్యనారాయణ పోటీ చేయొచ్చని పార్టీలో ప్రచారం జరుగుతోంది.

వైసీపీకి పోటీగా టీడీపీ అభ్యర్ధి…

టీడీపీ తరపున పోటీ చేయడానికి స్థానిక నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్న ఎంవీవీఎస్ మూర్తి మనవడు, హీరో బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ పేరు ముందు ఉంది.

ఒకవేళ సామాజిక సమీకరణలు మారితే.. గంటా శ్రీనివాసరావు లేదా, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులలో ఒకరిని బరిలో దింపుతారని తెలుస్తోంది.

ఇక అటు 2014 ఎన్నికలకు దూరంగా ఉన్న సుబ్బరామిరెడ్డి ఈ సారి కాంగ్రెస్ తరపునే పోటీచేసే అవకాశం ఉంది. ఇక జనసేన తరపున ఎవరు బరిలో ఉంటారన్నది ఆసక్తిగా మారింది.

కాంగ్రెస్ పక్కన పెట్టేస్తే…టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ టీడీపీ, వైసీపీలలో ఏదొకటి ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనిపిస్తోంది. మరి చూడాలి విశాఖ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారు అనేది….

మామాట: మరి విశాఖలో గెలిచేదెవరో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: