అక్కడ టీడీపీ విజయం పక్కానేనా?

Share Icons:

అనంతపురం, 29 ఏప్రిల్:

రాయలసీమ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న జిల్లా అనంతపురం. 2014 ఎన్నికల్లో మొత్తం 14 స్థానాల్లో టీడీపీ 12 గెలుచుకుని సత్తా చాటింది. వైసీపీ ఉరవకొండ, కదిరి 2 చోట్ల గెలిచింది. అయితే ఇప్పుడు జిల్లాలో మిగిలిన స్థానాలు ఎలా ఉన్న ఉరవకొండలో మాత్రం ఈసారి టీడీపీనే గెలుస్తుందని ప్రచారం జరుగుతుంది.

ఇక ఉరవకొండ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పయ్యావుల కేశవ్ వైసీపీ అభ్యర్ది విశ్వేశ్వరరెడ్డిపై ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కూడా వారిద్దరే ప్రత్యర్ధులుగా తలపడ్డారు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో….పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. కేశవ్ కు పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కూడా ఇవ్వడంతో ఆయనే నియోజకవర్గంలో అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరించారు. నియోజకవర్గ అభివృద్ధి ఘనత కూడా కేశవ్ తన ఖాతాలోనే వేసుకున్నారు. ఇది ఆయన కలిసొచ్చినట్లు కనిపిస్తుంది.

అటు విశ్వేశ్వర్ రెడ్డికి సొంత పార్టీ నుంచే పలువురు నేతలు సహకరించకపోవడం మైనస్ గా మారింది. ఇక్కడ మైనారిటీలు ఎక్కువగా వైసీపీ వైపు నిలిచారనే అంచనాలు ఉన్నాయి. అయితే, నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న బీసీలు మాత్రం తమకు అండగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది. పైగా గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఉండటం, అభివృద్ధి చేయడం కలిసొచ్చిందని కేశవ్ భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈసారి ఇక్కడ టీడీపీకే విజయావకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మామాట: మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి…

Leave a Reply