మళ్ళీ గెలుపు తనదే అంటున్న టీడీపీ సీనియర్ నేత…

Share Icons:

అమరావతి, 15 మే:

మరో 8 రోజుల్లో వెలువడనున్న ఫలితాల్లో మరొకసారి గెలిచి సత్తా చాటుతానని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ధీమాగా ఉన్నారు. 2014లో అనివార్య పరిస్థితిలో బిజెపితో పొత్తు కారణంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి అర్బన్ నుంచి రాజమండ్రి రూరల్ కు మారాలిసి వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతో బాటు టిడిపి పై ఉన్న సానుకూల పవనాలు అన్ని కలిసి గోరంట్ల కు పాతికవేల మెజారిటీ కట్టబెట్టేలా చేసింది.

అయితే ఇప్పుడు జనసేన మిత్రపక్షం నుంచి శత్రుపక్షంగా మారింది. వీటికి తోడు ప్రభుత్వ వ్యతిరేకపవనాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఈసారి తాను అదే పాతికవేల మెజారిటీతో గెలుస్తానని బుచ్చయ్య చెబుతున్నారు.

కాపుల అడ్డాగా పేరున్న రాజమండ్రి రూరల్ నుంచి వైసిపి, జనసేన కాపు అభ్యర్థులనే నిలబెట్టాయి. వీరిద్దరి నడుమ కాపు సామాజిక వర్గ ఓట్ల చీలిక సునాయాసంగా తనను గట్టున పడేస్తాయని గోరంట్ల లెక్క కట్టడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. బిసి ఓటు బ్యాంక్ తనకు పూర్తి అండగా నిలబడటంతో బుచ్చయ్య తనకు తిరుగులేదని భావిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా. ఇదే విషయం మొన్న అధినేత చంద్రబాబుకు కూడా చెప్పారని టాక్.

మామాట: మరి బుచ్చయ్య ధీమా ఎప్పటివరకో

Leave a Reply