మళ్ళీ ఆ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తే ఓడిస్తామంటున్న టీడీపీ కార్యకర్తలు…

Share Icons:

గుంటూరు, 11 జనవరి:

తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టికెట్ ఇస్తే ఓడిస్తామని టీడీపీ కార్యకర్తలు సీఎం చంద్రబాబుకి అల్టిమేటం జారీ చేశారు. శ్రావణ్‌కుమార్ గెలుపు కోసం కృషి చేసిన వారిని విస్మరించారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అసలు శ్రావణ్ గెలుపుకోసం పనిచేసిన వారిని గౌరవించకపోగా వారిపై కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు.  

తాడికొండ నియోజకవర్గంలో శ్రావణ్ కుమార్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని మండిపడుతున్నారు. దళితులను మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో శ్రావణ్ కుమార్‌కు టీడీపీ అదిష్టానం టికెట్‌ ఇవ్వొద్దని చంద్రబాబుని కోరారు. ఇక స్థానికులకు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయిస్తే గెలిపించుకుంటామని, ఒకవేళ స్థానికుల అభిప్రాయాల కాదని శ్రావణ్‌కే టికెట్ ఇస్తే ఓడిస్తామని అంటున్నారు.

మామాట: మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…

Leave a Reply