టీడీపీపై విజయసాయి ఫైర్…రివర్స్ ఎటాక్ చేసిన బుద్దా వెంకన్న

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

 

అమరావతి:

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినాయకత్వంపై విమర్శలు చేశారు. చంద్రబాబునాయుడు రహస్యాలు మాజీ స్పీకర్ కోడెల గుప్పెట్లో ఉన్నాయని, అందుకే కోడెల ఎన్ని నేరాలకు పాల్పడినా చంద్రబాబు ఖండించడంలేదని తెలిపారు. కోడెల, ఆయన కుటుంబ సభ్యుల గురించి రోజుకో కేసు తెరపైకి వస్తున్నా, పచ్చ పార్టీ వారిని కాపాడుతోందని ఆరోపించారు.

స్పీకర్ గా పనిచేసిన వారిలో అత్యంత హీనమైన చరిత్ర కలిగిన వ్యక్తి ఎవరని గూగుల్ లో వెదికితే కోడెల, ఆయన దూడల పేర్లు ప్రత్యక్షమవుతున్నాయంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం, కోడెల, ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

ఇక అటు టీడీపీ నేత బుద్ధా వెంకన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎంవో, సలహాదారులు, నామినేటెడ్ పదవులన్నీ రెడ్లకే ఇచ్చేశారని, విశ్వవిద్యాలయ వీసీ, రిజిస్ట్రార్ పదవులను కూడా రెడ్లతోనే నింపేశారని బుద్ధా ఆరోపించారు. ఆఖరికి జైలు నుంచి పెరోల్ పై విడుదలయ్యే ఖైదీలు కూడా రెడ్లేనని సెటైర్ వేశారు. ఇదంతా కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఇస్తున్న ప్రయోజనాలు కావా? అంటూ ప్రశ్నించారు. హైలీ రెస్పెక్టెడ్ విసా రెడ్డి గారు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

 

Leave a Reply