లోకేశ్ ట్విట్టర్ పిట్ట: వైసీపీ….జైల్లో ఉన్నవాళ్లే ట్వీట్స్ చేయాలా?టీడీపీ

tdp former mla ready join to ysrcp
Share Icons:

అమరావతి:

 

గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి , టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక లోకేశ్ విమర్శలపై స్పందిస్తున్న వైసీపీ….లోకేశ్ ఒక ట్విట్టర్ పిట్ట అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న విమర్శలపై టీడీపీ మహిళా నేత దివ్యవాణి ఘాటుగా స్పందించారు. లోకేశ్ ను ట్విట్టర్ పిట్ట అంటూ సంబోధిస్తుండడం పట్ల ఆమె మాట్లాడుతూ, ట్విట్టర్ లో పోస్టులు చేయాలంటే రెండేళ్లపాటు జైల్లో ఉండాలా? విజయసాయిరెడ్డిని ఉద్దేశంచి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితేనే నాయకుడు కాదని, ఆలోచనా శక్తి ఉన్నవాడే నాయకుడని, అలాంటి ఆలోచనా శక్తి లోకేశ్ కు పుష్కలంగా ఉదని దివ్యవాణి పేర్కొన్నారు.

 

పరిపాలనకు కావాల్సింది బుద్ధిబలం అని, లోకేశ్ బుద్ధిబలం గురించి ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టం చేశారు. ఇక సీఎం జగన్ పైనా ఆమె పరోక్ష విమర్శలు చేశారు. భవనాలను కూల్చివేయడం అభివృద్ధి అనిపించుకోదని, నిర్మించేవాడే నాయకుడని అన్నారు. “రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా అనేక సంక్షేమ పథకాలతో పాటు, రాజధానిని నిర్మించిన ఘనత చంద్రబాబు సొంతం.

 

చంద్రబాబుకు ఉన్న ప్రజాదరణ దేశంలో ఎవరికైనా ఉందా? నరేంద్ర మోదీకి పోటీ వచ్చే నాయకుడు చంద్రబాబు ఒక్కరే. ఏ విషయంలోనైనా మోదీని మించిన వ్యక్తి చంద్రబాబు. అందుకే ఏపీలో తెలుగుదేశం పార్టీని అందరూ కలిసి ఓడించారు” అంటూ ఆరోపించారు.

 

అలాగే టీడీపీ నేత వర్ల రామయ్య ‘తెలుగు తల్లి’ గురించి ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ లో జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘అయ్యా ముఖ్యమంత్రిగారూ, తెలుగు తల్లిని ఎందుకు అవమానిస్తున్నారు? మా తెలుగు తల్లికి ప్రార్థనా గీతం ఏమైంది? అమ్మను అవమానిస్తారా? ఇదేమి పద్ధతి? ఇదేనా రాజన్న రాజ్యం’ అని ప్రశ్నించారు.

Leave a Reply