అసెంబ్లీలో సవాళ్ళ పర్వం….టీడీపీ వర్సెస్ వైసీపీ…

tdp former mla ready join to ysrcp
Share Icons:

అమరావతి:

 

ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య సవాళ్ళ పర్వం నడిచింది. 2014 నుంచి రైతులకు సున్నా వడ్డీ పథకం అమలు చేశామంటూ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. దీనికి సీఎం జగన్ స్పందించారు. 2014 నుంచి 2019 వరకు సున్నా వడ్డీ పథకం కింద ఎంత ఇచ్చారో చెప్పాలని చంద్రబాబుకు సీఎం జగన్‌ సవాల్‌ విసిరారు. రికార్డులు తెప్పిస్తా చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని జగన్ సవాల్ విసిరారు.

 

ఇక జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటరిచ్చారు. విత్తనాలు ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విత్తనాలు కూడా ఇవ్వలేని మీరు ఐదేళ్లలో ఏం చేస్తారు? అని అడిగారు. జీడీపీ లెక్కలు ఆర్థికమంత్రి, తాను రాసేవి కావన్నారు. ఆ విషయం తెలియకుంటే ఇంట్లో కూర్చుని లెక్కలు రాసుకోండని వ్యాఖ్యానించారు.

 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు చంద్రబాబు ధన్యవాదాలు చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రతిపక్ష నేత స్పందించారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామికి జరిగిన అవమానానికి సీఎం జగన్ క్షమాపణలు చెబితే, తాను ఇప్పుడు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…టీడీపీ ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఉంటే ప్రజలకు ఈ ఇబ్బంది ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు దయచేసి ఫిర్యాదులు చేయకుండా నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో తమను కోరలేదని బొత్స స్పష్టం చేశారు.

 

కావాలంటే రికార్డులు పరిశీలించుకోవాలని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో ప్రతిపక్షం అంటే పనికిరాని పక్షంగానే చూశారని బొత్స విమర్శించారు. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిపక్షాన్ని కూడా విశ్వాసంలోకి తీసుకుంటుందని స్పష్టం చేశారు. తమను ఒకటి అని. తమ చేత 10 అనిపించుకోవద్దని బొత్స హితవు పలికారు.

Leave a Reply