ఆ ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి…

Share Icons:

 

అమరావతి, 14 జూన్:

8 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బాంబు పేల్చారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కూడా 2 నెలల నుంచి మాతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. 8 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు నేరుగా తనతో మాట్లాడుతున్నట్లు ప్రకటించారు.

అయితే వారంతా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ అడుగుతున్నారని, నియోజకవర్గాల్లో పనులు చేయమని అడుగుతున్నారని తెలిపారు. ఇక తనతో టచ్‌లో ఉన్నవారిలో ఒకరు నియోజకవర్గంలో బలమైన ఎమ్మెల్యే.. కానీ వాళ్ల పేర్లు బయటపెట్టనని పేర్కొన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే టచ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల జాబితాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో తనతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని.. జగన్‌ చెబితే ఏమైందో మీకు తెలుసని కేశవ్ పేర్కొన్నారు.

ఇదంతా వైసీపీ ఆడుతున్న మైండ్‌గేమ్‌ మాత్రమేనన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో సంక్షేమమే ఉంది తప్ప అభివృద్ధి కనిపించలేదన్నారు.

 

Leave a Reply