విశాఖ జిల్లాలో టీడీపీ గెలుపు ప‌క్కా అట‌..!

Share Icons:

విశాఖ, మార్చి 22,

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి టీడీపీలోచేరడంతో విశాఖప‌ట్నం జిల్లా రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయా..? అన్న ప్ర‌శ్న‌కు రాజ‌కీయ విశ్లేష‌కులు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు. అందుకుగ‌ల కార‌ణాల‌ను వారు చెబుతూ స‌బ్బం హ‌రికి గ‌తంలో విశాఖప‌ట్నం న‌గ‌ర మేయ‌ర్‌గా ప‌నిచేసిన అనుభ‌వంతోపాటు, ఆ జిల్లా ప్ర‌జ‌లు ఆయ‌న్ను ఎంపీగా కూడా ఎన్నుకున్నారు. ఆ క్ర‌మంలో ఆయ‌న‌కు జిల్లా వ్యాప్తంగా ఏర్ప‌డ్డ ప‌రిచ‌యాలు ఇప్పుడు టీడీపీ ఘ‌న విజ‌యానికి దోహ‌ద‌ప‌డ‌నున్నాయిట.

ఈ ఎన్నిక‌ల్లో భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా స‌బ్బం హ‌రికి టికెట్ కేటాయిస్తూ సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం త‌రుపున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీ‌నివాస్ కాస్త ఆందోళ‌న చెందుతున్న‌ట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.

అయితే, మొద‌ట‌ విశాఖ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మేయ‌ర్‌గా సేవ‌లందించిన స‌బ్బం హ‌రి అభివృద్ధితో వారి మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఆ క్ర‌మంలోనే విశాఖ -1 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి పోటీ చేసిన స‌మ‌యంలో ఓట‌మిని చ‌విచూసినా ఆ త‌రువాత జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ఘ‌న విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. ఆ త‌రువాత చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను దృష్ట్యా స‌బ్బం హ‌రి సీఎం చంద్ర‌బాబు స‌మక్షంలో ప‌సుపుకండువాను కప్పుకున్నారు.

ఇదిలా ఉండ‌గా, టీడీపీకి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో భీమిలి ఒక‌టి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు భీమిలిలో ఎనిమిదిసార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా అందులో ఆరుసార్లు టీడీపీనే ఘ‌న విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం భీమిలి నుంచి స‌బ్బం హ‌రి గెలుపు కూడా సునాయాస‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

మామాట: సబ్బం గారి పబ్బం గడిచింది గా,

Leave a Reply