టీడీపీకి షాక్ ..వైసీపీలో చేరిన సీనియర్ నేత…

Share Icons:

అమరావతి, 11 ఫిబ్రవరి:

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ రోజురోజుకి బలపడుతుంది. ఇప్పటికే పలు సర్వేలు రాబోయే ఎన్నికలలో వైసీపీ అధికారం దక్కుతుందని చెబుతుండటంతో… ఇతర పార్టీల నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు.

ఈ క్రమంలోనే  అధికార టీడీపీ నుండి ఓ సీనియర్ నేత వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లా సీనియర్ నేత వైవీ రామిరెడ్డి గ‌త 30 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతూ.. టీడీపీలో కీల‌క‌నేత‌గా ఉన్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఆశించిన రామిరెడ్డికి టిక్కెట్ క‌ష్ట‌మ‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పార‌ని తెలుస్తోంది.

దీంతో తీవ్ర అంస‌తృప్తిలో ఉన్న రామిరెడ్డి తాజాగా.. జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరి.. టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చారు. ఇక ఆయ‌న‌తో పాలు పలువురు కార్య‌క‌ర్త‌లు మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, మాజీ కార్పోరేట‌ర్ ఇలా ప‌లువురు ఒకే సారి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో కీల‌క నేత‌లు ఇలా పార్టీని వీడటం టీడీపీకి పెద్ద దెబ్బే అని చెప్పాలి.  

మామాట: ఎన్నికల వేళ ఈ జంపింగ్‌లు మామూలే

 

Leave a Reply