6093 అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే జగన్‌ పేరు కనిపిస్తుంది….

tdp president chandrababu sensational comments on jagan
Share Icons:

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన రాజధాని గ్రామల్లో పర్యటనలో భాగంగా సతీసమేతంగా అక్కడకు చేరుకున్న బాబు మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ జీఎన్‌ రావు పనికిమాలిన అధికారి.. ఆయన పేరుతో కమిటీ వేశారని ధ్వజమెత్తారు. ‘‘ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి ఫ్రెండ్‌ బీసీజీ డైరెక్టర్‌ భట్టాచార్య. విభజన చట్టాన్ని ఉల్లంఘించే అధికారం మీకు ఎవరిచ్చారు?. 6093 అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే జగన్‌ పేరు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

జైలుకెళ్లి వచ్చిన వ్యక్తి మన సీఎం..సిగ్గులేని వ్యక్తి జగన్. విభజన చట్టంలో మూడు రాజధానులు అని లేదు. విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని నిర్మించాలని, శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పింది. నాడు రాజధానిని దొనకొండకు తీసుకెళ్లాలని చూశారు’’ అని చంద్రబాబు తెలిపారు. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ కొత్త పాట అందుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ మాదిరిగా అందరూ దొంగ లెక్కలు రాస్తారని అనుకుంటున్నారని, అమరావతిలో అన్నీ చట్టబద్ధంగా జరిగాయని తెలిపారు. అమరావతిలో 10వేల కోట్లు ఖర్చు చేశామని, భూముల ధరలు పెరిగితే మీకు ఎందుక కడుపు మంట అని చంద్రబాబు ప్రశ్నించారు.

రాష్ట్రానికి రాజధాని ఉండాలని నాడు రైతులు త్యాగం చేశారని, తన పిలుపునకు స్పందించి స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని తెలిపారు. 25ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో విజన్‌ 2020 ప్రారంభించానని, హైటెక్‌ సిటి నిర్మించి చేతలతో అభివృద్ధి ఏంటో చూపించానని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘విభజన వల్ల ఏపీ ఎంతో నష్టపోయింది. రాజధాని కోసం నాడు యజ్ఞం చేపట్టాం. నాపై నమ్మకంతో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని తెలిపారు. విశాఖలో ఎయిర్‌పోర్టు కోసం నాలుగేళ్లయినా భూసేకరణ జరగలేదని,  అమరావతిలో రైతులు త్యాగం చేసి భూములు ఇచ్చారని, అమరావతిలో ప్లాట్లు ఇస్తామంటే.. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం రైతులు భూములు ఇచ్చారని, నా కుటుంబ సంతోషం కూడా కాదనుకుని రాష్ట్రం కోసం కష్టపడ్డానని, నాలుగేళ్లలో నా మనవడితో రెండు గంటలు కూడా గడపలేదని చంద్రబాబు గుర్తుచేశారు.

 

Leave a Reply