టీడీపీ మహానాడు వాయిదా…

Share Icons:

అమరావతి, 15 మే:

ప్రతి ఏటా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు జయంతిని పురస్కరించుకుని జరిపే మహానాడు కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు నిర్వహించాల్సిన ‘మహానాడు’ని వాయిదా వేస్తున్నట్లు టీడీపీ తెలిపింది.

సీఎం చంద్రబాబు మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాల విడుదలకు, మహానాడుకు మధ్య గ్యాప్ పెద్దగా లేకపోవడం, ఫలితాల విడుదల తర్వాత కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉండడంతో మహానాడును ఈసారికి వాయిదా వేయాలని నిర్ణయించారు.

దీనికి బదులుగా ప్రతి వూరిలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే నిజానికి మహానాడు నిర్వహించాలంటే కనీసం నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించాల్సి ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. అలాగే, ఎన్నికల ఫలితాలకు, మహానాడు తేదీకి మధ్య నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో మహానాడును ఈసారి వాయిదా వేయాలన్న నిర్ణయానికే వచ్చారు.

మామాట: ఫలితాలు అనుకూలంగా రావనేనా వాయిదా…

Leave a Reply