ట్విట్టర్ యుద్ధం: విజయసాయిపై కేశినేని సెటైర్…కేశినేనిపై పీవీపీ ఫైర్

kesineni nani versus pvp twitter war
Share Icons:

అమరావతి: ఈ మధ్య రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. రాజకీయ నేతలు బయటకంటే సోషల్ మీడియా వేదికగానే విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నేతలైతే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా కూడా వీరి మధ్య ట్విట్టర్ యుద్ధం తారస్థాయికి చేరుకుంది. కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి లక్ష్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. “నిన్న సుజనా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపి) వేరు… అందులో ఉన్న బాబు జనాల పార్టీ (బీజేపి) వేరు అని అందరికీ మరోసారి బాగా అర్ధమయింది” అని ఆయన సెటైర్ వేశారు. కాగా, సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం బీజేపీవైపే చూస్తున్నారని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అలాగే విజయసాయిరెడ్డి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఫిర్యాదు చేశారు. ఈ నెల 17న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నేతృత్వంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తనకు అవమానం జరిగినట్టు వార్తలు ప్రచురించారని… తన మర్యాదకు భంగం కలిగించేలా నిరాధార వార్తలను రాశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు పత్రికలకు చెందిన విలేకర్లకు పార్లమెంటు పాసులు రద్దు చేయాలని కోరారు.

ఇక ఇదే అంశంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. ‘ఈ గోలంతా ఎందుకు… మన సాక్షి టీవీ, సాక్షి పేపరు మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే పోలా’ అంటూ ఎద్దేవా చేశారు. అయితే కేశినేనిపై వైసీపీ నేత పీవీపీ ఫైర్ అయ్యారు. ఈ గోలంతా ఎందుకు… మన సాక్షి టీవీ, సాక్షి పేపరు మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే పోలా అంటూ ఎద్దేవా చేశారు. దీనికి కొనసాగింపుగా… కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టాలు చేయడానికి చట్ట సభలో నువ్కొకడివని… ఆ పనేదో నువ్వే చేసి పుణ్యం కట్టుకో అని వ్యాఖ్యానించారు. ఎలాగూ నీ బతుక్కి ఒక్క బిల్లు కూడా ప్రవేశపెట్టింది లేదు, సచ్చింది లేదని ఎద్దేవా చేశారు. కావాలంటే తాను ఇంగ్లీషులో రాసిపెడతా నిశానీ దొరగారూ అంటూ ట్వీట్ చేశారు.

 

Leave a Reply