‘వ్యవస్థను కడిగే ముందు మనల్ని మనం కడుక్కోవాలి జగన్ గారూ’ కేశినేని సెటైర్..

tdp mp kesineni nani setaire on cm jagan
Share Icons:

అమరావతి:

 

అత్యధిక మెజారిటీతో గెలిచి సీఎం అయిన జగన్ మోహన్ రెడ్డి….పాలన మొదలవ్వడమే వ్యవస్థను సమూలంగా కడిగేద్దామని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తన స్థాయిలో వ్యవస్థను శుభ్రం చేసే పనిని తాను ప్రారంభించానని… జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా అదే చేయాలని ఆయన అన్నారు. మీరిద్దరూ మనసు పెడితే అవినీతిని సమూలంగా నిర్మూలించడం సాధ్యమేనని చెప్పారు.

 

ఇక జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. ‘వ్యవస్థను కడిగే ముందు మనల్ని మనం కడుక్కోవాలి జగన్ గారూ’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కడిగిన మాత్యాలు మాత్రమే వ్యవస్థలను కడగగలవని అన్నారు. ఈడీ, సీబీఐ కేసులు ఉన్న మీరు ఈ వ్యవస్థను ఎలా కడుగుతారంటూ ప్రశ్నించారు.

 

ఇదిలా ఉంటే పార్లమెంట్ అంచానాల కమిటీలో టీడీపీ ఎంపీ కేశినేని నానికి చోటు దక్కింది. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ కమిటీలో 29 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. మొత్తం 31 మంది నామినేషన్ వేయగా.. ఇద్దరు సభ్యులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. వార్షిక బడ్జెట్ అంచనాలను పరిశీలించి, వ్యయంలో పొదుపు చర్యలు తీసుకొనేలా ప్రభుత్వానికి ఈ కమిటీ పలు సూచనలు చేస్తుంటుంది. ఈ కమిటీ గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ 30న ముగియనుంది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.

Leave a Reply