జగన్‌ని కోర్టులో కేసు వేయమంటున్న టీడీపీ ఎంపీ…

Share Icons:

అమరావతి: గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ,ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో కూడా దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ,ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకమని అసెంబ్లీలో తీర్మానం చేసి, చట్టపరంగా దీనికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని  ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కోరుతున్నట్లు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని తెలిపారు.

ఈ మేరకు కడపలో నిర్వహించిన సమావేశంలో తీర్మానించినట్లు ట్వీట్‌ చేశారు. ‘అయ్యా…జగన్‌గారూ ఈ చట్టాల వల్ల ముస్లింలే కాదు అన్ని వర్గాల  ప్రజలు ఇబ్బందులు పడతారు. అందుకే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి సుప్రీం కోర్టులో వీటిని వ్యతిరేకిస్తూ పిటిషన్‌ దాఖలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అంటూ ట్విట్టర్‌లో తెలిపారు.

ఇదిలా ఉంటే ఎన్ఆర్సీ మీద కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళితే తాను రాజీనామా చేస్తానని ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా కడపలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీలో అంజద్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. ‘నాకు పదవులు ముఖ్యం కాదు. నియోజకవర్గ ప్రజలే ముఖ్యం. ఎన్ఆర్సీ మీద కేంద్రం ముందుకు వెళితే రాజీనామాకు సిద్ధం. ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎం జగన్‌ను ఒప్పిస్తా.’ అని అంజద్ బాషా స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదని అంజద్ బాషా తేల్చి చెప్పారు.

జగన్‌‌కు బీజేపీ రంగు పూయాలని 2011 నుంచి కుయుక్తులు పన్నుతున్నారు. సోషల్ మీడియాలో కల్పిత ప్రచారాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో జట్టుకట్టబోంది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఈ రోజు ఆ పార్టీతోనే జట్టుకడుతున్నారు. వారంతా నిలకడలేని వారు. మాకు 151 సీట్లు ఉన్నాయి. ఆ దౌర్భాగ్యం మాకు లేదు.’ అని అంజద్ బాషా అన్నారు.

 

Leave a Reply