ఢిల్లీ బాటపట్టిన టీడీపీ ఎమ్మెల్సీలు…వారు డుమ్మానే..

main leaders ready to leave tdp
Share Icons:

ఢిల్లీ: ఏపీ శాస‌న స‌భ‌, శాస‌న మండ‌లిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రొరోగ్ చేసిన విషయం తెలిసిందే. ఉభ‌య స‌భ‌ల‌ను ప్రొరోగ్ చేస్తూ ఆయన గురువారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. శాస‌నస‌భ‌, మండ‌లిని ప్రొరోగ్ చేసిన నేప‌థ్యంలో ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) ర‌ద్దు బిల్లుల స్థానంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ తీసుకుని రావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిఫారసుల మేరకే గవర్నర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనేది తెలుగుదేశం పార్టీ వాదన.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటోన్న సంచనల నిర్ణయాలపై తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి రెడీ అవుతోంది. మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో అమరావతి రైతులు కొనసాగిస్తోన్న పోరాటాన్ని ఇప్పటికే ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లిన టీడీపీ.. ఇక శాసన మండలిని ప్రొరోగ్ చేయడాన్ని కూడా అదే దృష్టితో చూస్తోంది. దేశ రాజధానిని కేంద్రంగా చేసుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించింది.

శాసనసభ, శాసన మండలిని ప్రొరోగ్ చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మొదలుకుని, రాష్ట్రపతి దాకా అందర్నీ కలుసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకున్నారు. అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను కలుసుకోనున్నారు. వారికి వినతిపత్రాలను అందజేయనున్నారు. వైఎస్ జగన్ వైఖరిని వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. వారితో పాటు పలువురు కేంద్రమంత్రులను కలుసుకోనున్నారు.

దీనికోసం ఇప్పటికే ఆయా నేతల అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ రెండురోజుల కిందటే ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. శుక్రవారం ఆయన మరోసారి హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సారి ఆయన అమిత్ షాను కలుస్తారు. జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకోగానే, టీడీపీ వాళ్ళు ఫ్లైట్ ఎక్కనున్నారు.

 

Leave a Reply