జగన్ దేశానికే అపఖ్యాతి తెస్తున్నారు….

CM YS Jagan Mohan Reddy to address CRDA meeting on Amaravati capital
Share Icons:

అమరావతి: వరుసగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై ట్విట్టర్ లో విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తన తీరుతో దేశానికే అపఖ్యాతి తెస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ పై అంతర్జాతీయ సంస్థలు చట్టబద్ధ చర్యలకు సిద్ధమవుతున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో వచ్చిన కథనాలను లోకేశ్ పోస్ట్ చేశారు.

‘ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనా విధానాల వైఫల్యాలు, ఆయన ప్రతీకార చర్యల కారణంగా తలెత్తిన పరిస్థితులతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖను హెచ్చరిస్తున్నారు. పెట్టుబడిదారులు ఇక్కడ అడుగుపెట్టకుండా చేయడమే కాకుండా ఈ మనిషి (జగన్) దేశానికే అపఖ్యాతి తెచ్చిపెడుతున్నారు’ అని లోకేశ్ పేర్కొన్నారు.

అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గ్లోబల్ కంపెనీలు కేసులను వేయనున్నాయని నేడు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన చంద్రబాబు, వీటిని చూస్తుంటే తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత జూలైలో పలు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుల బిడ్డింగ్ లో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం కారణాలు చూపింది. ఇక దీనిపై క్రిసిల్ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ, ఏపీలో భవిష్యత్ పెట్టుబడులకు విఘాతం కలిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని, పలు కంపెనీలు సర్కారుపై కేసులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ కథనం ప్రచురితమైంది. ఇక దీన్నే ప్రస్తావించిన చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు.

అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు  వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే పడవ వంటిదని అన్నారు. ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు తదుపరి ముఖ్యమంత్రి ఎవరని చర్చించుకుంటున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని అన్నారు. అన్ని శాఖల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని తెలిపారు. గత ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని సాధించిన జగన్… సొంత పార్టీ ఎంపీలపై ఇంత త్వరగా పట్టును ఎందుకు కోల్పోతున్నారని అన్నారు.

 

Leave a Reply