జగన్ పై లోకేశ్ కామెంట్…వాళ్ళు తెలుగులో చదివారా?

nara lokesh fires on ysrcp government
Share Icons:

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ స్పందనపై వెంటనే నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగు మీడియం ఉండాలని మాట్లాడుతున్న నేతల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన టీడీపీ నేత నారా లోకేశ్.. కౌంటర్ ఇచ్చారు. ‘ఇంగ్లిష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు’ అని ఉద్యమం చేసినప్పుడు సీఎం జగన్ పిల్లలు తెలుగు మీడియంలోనే చదివారా? అని నిలదీశారు.

‘అయ్యా గజిని జగన్ గారు.. మీ పవిత్ర పత్రిక, మీరు గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేశారు గుర్తు లేదా? నగర పాలక పాఠశాలల్లో టీడీపీ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ రోజు మీరు అడ్డుపడ్డారు’ అని ట్వీట్ చేశారు. ”ఎందుకింత తెగులు?’, ‘తెలుగు లెస్సేనా?’ అంటూ ఉద్యమం చేసిన రోజు మీ బుద్ధి ఏమయ్యింది? జగన్ గారూ! ‘ఇంగ్లిష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు’ అని మీరు ఉద్యమం చేసినప్పుడు మీ అమ్మాయిలు తెలుగు మీడియంలో చదివారా?’ అని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.

అటు తర్కానికందని కోతలు కోస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘తుపాను ఎక్కడ తీరం దాటేది నాకు ముందే తెలుసు. హైదరాబాద్ ను  నేనే నిర్మించా. నా విజన్-2020 డాక్యుమెంటును అబ్దుల్ కలామ్ కాపీ కొట్టారు’ అని ఒకరు కోతలు కోస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. ‘సూడోలాజియా ఫెంటాస్టికా (pseudologia fantas´tica) అనే మానసిక రుగ్మత వల్లే ఇలా అయిపోయారు పాపం. తర్కానికందని కోతలు కోయడం దీని లక్షణమే’ అని ఎద్దేవా చేశారు.

విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ‘యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధి వలనే జగన్ గారు, మీరు ఇలా అయిపోయారు విజయసాయిరెడ్డి గారూ. అబద్ధాలు చెప్పడం, చట్టాన్ని ఉల్లంఘించడం, ప్రజల్ని దోచుకోవడం, విధ్వంసం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు’ అని ఎద్దేవా చేశారు. ‘డెంగ్యూతో ప్రజలు చస్తుంటే సంబరాలు చేసుకోవడం, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే జోకులు వెయ్యడం, 45 ఏళ్లకే పెన్షన్ అని మహిళలను మోసం చెయ్యడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మేయడం, సొంత వారిని లేపేయడం అన్నీ ఈ వ్యాధి లక్షణాలే.. వాళ్లు మాత్రం ఏమి చేస్తారు పాపం’ అని మరో ట్వీట్ లో బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 

Leave a Reply