జగన్ తెలుగుజాతి ప్రతిష్ఠను మంటగలుపుతున్నారు

Share Icons:

అమరావతి, 23 ఫిబ్రవరి:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలుగు జాతి ప్రతిష్ఠను అంతర్జాతీయంగా మంటగలుపుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని పెంచేందుకు ప్రయత్నిస్తుంటే, జగన్ తెలుగు జాతి ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ఆరోపించారు.

తెలుగు జాతికి జగన్ తీవ్ర తలవంపులు తీసుకొచ్చారని, విశ్వసనీయత గురించి ఆయన ఉపన్యాసాలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు.

ప్రజా జీవితానికి జగన్ అనర్హుడని, అతని అవినీతికి అంతేలేదని, తవ్వినకొద్దీ తన అవినీతి బయటపడుతూనే ఉందని కేశవ్ మండిపడ్డారు. ఇక అలాంటి వ్యక్తి నీతి సూత్రాలు వల్లించడం, విశ్వసనీయత గురించి మాట్లాడడం సిగ్గుచేటైన విషయమన్నారు.

రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కష్టపడుతుంటే, దాన్ని జగన్ అడ్డుకోవడానికి చూస్తున్నారని పయ్యావుల దుయ్యబట్టారు.

మామాట: ఎవరు తక్కువ తిన్నారులే….కేశవా..!

English summary:

TDP MLC Payyavula Kesav said YSR Congress Party president YS Jaganmohan Reddy tapped the Telugu nation’s image internationally.

Leave a Reply