వాళ్ళు అలా చెబుతుంటే కన్నీళ్లు ఆగడం లేదు..

Share Icons:

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అరాచకం కొనసాగుతుంటే ఈసీ, పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. అధికారులు ప్రభుత్వానికి కాదు.. ప్రజలకు సేవకులు అని గుర్తించాలని చెప్పారు. ఫిర్యాదు చేసేందుకు ఫోన్‌ చేస్తే కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అయితే మహిళల దుస్తుల్లో పోలీసులు చేతులు పెడుతున్నారని బాధితులు చెబుతుంటే కన్నీళ్లు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ వ్యవస్థలోని చీడపురుగులను ఏరివేసే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రజలంటే లెక్కలేనితనంగా ఈసీ ప్రవర్తించొద్దని, దాడులకు బాధ్యులైన మంత్రులు, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.. వ్యవస్థలను ప్రజలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు పెంచాలని లేఖలో వినతి చేశారు. రిటర్నింగ్‌ అధికారులు సకాలంలో నో డ్యూ, కులధ్రువీకరణ పత్రాలు అందజేయలేదని తెలిపారు. అధికారులు అందుబాటులో లేని కారణంగా ఇవ్వలేదని బాబు పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ చర్యలకు కొన్ని చోట్ల ఓ వర్గం పోలీసులు కూడా సహకరించారని చెప్పారు. సకాలంలో నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని వెల్లడించారు. 76 చోట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే సంఘటనలు జరిగాయని, వీటికి సంబంధించిన ఆధారాలను లేఖకు జత చేసినట్లు తెలిపారు. కులధ్రువీకరణ, నో డ్యూ సర్టిఫికెట్లు లేకపోయినా నామినేషన్లు ఆమోదించాలని కోరారు. ప్రతిపక్షం చేసే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు.

 

Leave a Reply