ఉన్నట్టుండి అడ్డంగా ఎదిగిన వారికి ఏం తెలుస్తోంది?

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

అమరావతి:  వైసీపీ సీనియర్ నేత, ఎంపీ  విజయ సాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సినీ నటులను విమర్శిస్తూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చారు. సినీ నటులను ఘోరంగా అవమానించడాన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు. గోస్ట్ రైటర్ రాస్తే, పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యే అని తక్కువ చేసి మాట్లాడతారా అని ప్రశ్నించారు. సినిమా రంగంలో ఉండే కష్టం.. ఉన్నట్టుండి అడ్డంగా ఎదిగిన వారికి ఏం తెలుస్తుందని, నటుల కష్టాన్ని, కళని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జనసేన మాజీ నేత రాజా రవితేజ చెప్పిన అంతఃపుర రహస్యాలు అందరికే తెలిసినవేనని ట్వీట్ చేశారు. దత్త పుత్రుడు పవనిజం గ్రంథాన్ని రాసాడంటే ఎవరూ నమ్మలేదని.. గోస్ట్ రైటర్ రాస్తే పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యేనని వ్యాఖ్యానించారు. స్పీచ్ లు, సోషల్ మీడియా కామెంట్లన్నీ బ్యాక్ గ్రౌండ్‌లో ఎవరో రాస్తున్న సంగతి తెలియనిదేమీ కాదని విజయసాయి రెడ్డి అన్నారు.

అయితే వైసీపీ ప్రభుత్వ చర్యలన్నీ ప్రజా వ్యతిరేకమే అని రుజువు చేశామంటూ నిన్న టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాము అడిగిన ప్రశ్నలకు వైసీపీ సూటిగా సమాధానం చెప్పలేకపోతోందని ఆయన మండిపడ్డారు. యనమల వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమల గారు కూడా నీతి బోధలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో ఈయన కూడా ప్రధాన భాగస్వామని ఆరోపించారు. ‘అప్పటి పల్లకీ సేవకు తన బంధువులకు అనేక పదవులు, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇప్పించుకున్నాడు. కులజ్యోతి రాసిన కడుపు మంట వార్తను పట్టుకుని పత్తిగింజ కబుర్లు చెబుతున్నాడు’ అని విమర్శించారు.

 

Leave a Reply