స్మశానాలకు వైసీపీ రంగులు…విజయసాయిపై బుద్దా ఫైర్…

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

అమరావతి: ప్రతిరోజూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ విమర్శలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయసాయి చంద్రబాబుపై విమర్శలు చేశారు.  అనుభవజ్ఞుడని నమ్మి ప్రజలు గెలిపిస్తే బాబు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావని విజయసాయి ఆరోపించారు. ఎన్టీపీసీ సహా విద్యుత్తు సంస్థలకు రూ. 20 వేల కోట్లపైనే బకాయిలు కావడానికి బాబు కారణమయ్యారని విమర్శించారు. జెన్‌కోను ధ్వంసం చేసి ప్రైవేటుకు దోచిపెట్టాడని మండిపడ్డారు.

ఇక వాటికి కౌంటర్ గా బుద్దా ట్వీట్ చేస్తూ….‘‘స్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే శకుని మామా(విజయసాయిరెడ్డి) నువ్వా చంద్రబాబు గారి గురించి మాట్లాడేది?పెద్ద పెద్ద విషయాలు మాట్లాడే ముందు ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పు. గోదావరిలో మీ ప్రభుత్వం ముంచేసిన బోటులో ఎంత మంది ఉన్నారు? వరద ఉన్నప్పుడు బోటు వెళ్లడానికి అనుమతి ఇచ్చిన మంత్రి ఎవరు? ఇప్పటి వరకూ ఎంత మంది మృతదేహాలు వెలికితీశారు? ఇంకా ఎంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది? గోదావరిలో కూడా 144 సెక్షన్ పెట్టిన ఘనత మీ తుగ్లక్ వైఎస్ జగన్‌ది.

బోటు ప్రమాదంలో మీరు చంపేసిన వ్యక్తుల కుటుంబాలకు గతంలో మీరు డిమాండ్ చేసిన విధంగా 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఎప్పుడు ఇస్తున్నారు? ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే, మరి మీ జగన్ ఎప్పుడు రాజీనామా చేస్తున్నాడు? సమాధానం చెప్పగలవా శకుని మామా!!’’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.

జగన్ ప్రభుత్వంపై నాదెండ్ల విమర్శలు….

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు విమర్శలు గుప్పించారు. సచివాలయ వ్యవస్థ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి 3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులు ఎందుకని అడిగారు. జగన్ పాలనలో అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదని సూచించారు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. ఇటీవలే అమిత్ షా సమక్షంలో నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

 

Leave a Reply