TRENDING NOW

స్క్రిప్ట్ రెడీ కానందునే జగన్ మీడియా ముందుకు రాలేదు…

స్క్రిప్ట్ రెడీ కానందునే జగన్ మీడియా ముందుకు రాలేదు…
Views:
34

విజయవాడ, 8 నవంబర్:

కోడి కత్తి డ్రామా స్క్రిప్ట్ రెడీ కానందునే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మీడియా ముందుకు రాలేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలుగు ఛానల్స్ అంటే జగన్‌కు ఇష్టం లేనప్పుడు, కనీసం ఇంగ్లిష్ ఛానల్స్‌లో అయినా మాట్లాడొచ్చు కదా అని అన్నారు.

ఇక ఈ కోడి కత్తి దాడిని జగన్ తనపై తాను చేయించుకున్నారని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందనీ, అందువల్లే ముఖం చూపించలేక ఆయన మీడియా ముందుకు రావడం లేదని దుయ్యబట్టారు.

అసలు ఘటన జరిగి 15 రోజులు దాటితే ప్రజాసంకల్ప యాత్ర, బహిరంగ సభల్లో మాట్లాడుతానని చెప్పిన జగన్ సైలెంట్ అయిపోవడం వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నించారు.

కోడికత్తి దాడిపై ప్రజలకు ఏం చేప్పాలో జగన్ కు అర్థం కావడం లేదని, కాలికి గాయమైతే పాదయాత్ర ఆపడంలో అర్థం ఉందనీ, కానీ భుజానికి గాయమైతే ఇంతకాలం ఆగిపోవడం ఏంటని ప్రశ్నించారు.

మామాట: మరి ప్రజలు ఎవరి స్క్రిప్ట్ నమ్ముతారో….

(Visited 39 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: