సొంత కులానికే జగన్ బాగా ఉపయోగపడుతున్నారు…

Share Icons:

అమరావతి: ప్రతిరోజూ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్‌ బీసీలకు అన్యాయం చేస్తున్నారని, జగన్‌ ఆయన కులానికి తప్ప, ఇతరులెవరికీ ఉపయోగపడని సీఎం అని ఆరోపించారు. ఇతర కులాలను జగన్‌ పక్కన పెట్టేశారని.. బీసీలు పదవుల్లో ఉండడం జగన్‌కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. పిటిషన్‌ కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిసినా ఎన్నికలకు వెళ్లారన్నారు. జగన్‌ ఇల్లు ఉన్న ప్రాంతంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొందన్నారు.

అటు విజయసాయిరెడ్డి ఏ హోదాలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని, విజయసాయిరెడ్డికి ఉన్న అధికారాలు ఏంటి?. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. మొన్న ఓటేసిన వారు కూడా వైసీపీని ఛీ కొడుతున్నారని,  నామినేషన్లు వేసిన టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని,  వాలంటీర్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని చెప్పారు. ఓటేయకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తే ఊరుకునేది లేదు’ అని బుద్దా వెంకన్న చెప్పుకొచ్చారు.

జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. ‘ఓలి రాంగోలి’ అంటూ ఆయన చేసిన ట్వీట్ జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. పాలన మొత్తం రంగులమయమైందని.. రంగుల జలగం అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హోలీ సందర్భంగా జంపండు రంగుల పథకం ప్రారంభమైందంటూ సెటైర్ వేశారు.

బుచ్చయ్య ట్వీట్

‘‘రాష్ట్రంలో జలగం ప్రవేశ పెట్టిన రంగులు మూడు.. అవి నీలం, తెలుపు, ఆకుపచ్చ. ఈ రంగులు జలగన్న కార్యాలయాల్లో వలంటీర్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. దీనికి జాంపండు రంగులు పథకం అని నామకరణం చేశారు. దీనికి అట్టహాసంగా 151 మంది కళాకారులతో శ్రీ జంపండు గారు ప్రారంభిస్తారు. ముందుగా ఏ2 వెలగపండు గారు.. ఏ1 జాంపండు గారికి మూడు రంగులు పూసి ప్రారంభిస్తారు. ఈ రంగులు స్వచ్ఛమైన అవినీతి మరకలకి ప్రసిద్ధి. దీనిని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పూసి ఆనందించాలని జాంపండు అలియాస్ జలగం కంకణం కట్టుకున్నారు. మొత్తానికి రంగు పడింది అని జనాలు అనుకుంటున్నారు’’. కలర్స్ సీఎం, ఫెయిల్డ్ సీఎం జగన్ హ్యాష్ ట్యాగ్‌లతో ఈ ట్వీట్ చేశారు.

 

Leave a Reply