అన్న క్యాంటీన్లలో 150కోట్ల స్కామ్ జరిగిందన్న విజయసాయి…కౌంటర్ ఇచ్చిన బుద్దా

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

విజయవాడ:

 

ఒకవైపు టీడీపీ ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత పీవీపీల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ ని టార్గెట్ చేసి పెడుతున్న ట్వీట్లకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే అన్న క్యాంటీన్ల విషయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. క్యాంటీన్లను సర్కారు మూసివేస్తోందంటూ టీడీపీ గళమెత్తగా, అన్న క్యాంటీన్ల ఏర్పాటులో పెద్ద కుంభకోణం ఉందంటూ తాజాగా వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు.

 

ఎన్నికల ముందు ప్రజల్ని ప్రలోభపెట్టేందుకే చంద్రబాబు సర్కారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని, అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.150 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ట్వీట్ చేశారు. చివరికి పేదవాళ్లకు అతి తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారంటూ మండిపడ్డారు. రూ.2 లక్షలతో నిర్మించే క్యాంటీన్ కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చయిందంటూ లెక్కలు చూపారని విజయసాయి ఆరోపించారు.

 

ఇక దీనికి బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. అన్న క్యాంటీన్లు మూసేసి పేదల కడుపులు కాలుస్తున్న పైశాచిక ఆనందం మీ మాటల్లో కనిపిస్తోందంటూ విజయసాయిరెడ్డికి కౌంటర్ వేశారు. నాలుగు రోజుల పాటు మతయాత్ర చేస్తున్న మీ అధినేత సెక్యూరిటీ కోసం రూ.22.52 లక్షల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు, నిత్యం వేల సంఖ్యలో పేదవాళ్లకు ఏళ్ల తరబడి సేవలు అందించే అన్న క్యాంటీన్ ను రూ.35 లక్షలతో నిర్మించకూడదా? అంటూ బుద్ధా వెంకన్న నిలదీశారు.

 

 

Leave a Reply