విజయసాయి బుద్దా కౌంటర్…సెలక్ట్ కమిటీకి బిల్లులు వెళ్ళాయన్న యనమల

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

అమరావతి:  ఈరోజు ఉదయం ఇంకా 1990ల్లోనే ఉంటే ఎలా బాబూ!’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విజయసాయిరెడ్డి చేసిన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విమర్శలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

‘విజయసాయిరెడ్డి గారు.. మీరు, మీ జగన్ గారు 2020లో ఉన్నారు కదా మీ దమ్ము, సత్తా సీబీఐ, ఈడీ ముందు చూపించండి. అప్పుడు ఎవరు ఏ కాలంలో ఉన్నారో తేలిపోతుంది. మొన్నటి వరకూ 151 అని కాలర్ ఎగరేశావ్. ఇప్పుడు గేట్లు ఎత్తమంటారా? అనే స్థితికి వచ్చారు’ అని ట్వీట్ చేశారు. ‘బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్తే తడుపుకొని మండలి రద్దు చేసిన మీరా దమ్ము, ధైర్యం గురించి మాట్లాడేది? 151 మంది ఉన్నాం అని చెప్పి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లా కొన్నప్పుడే మీ వాడికి సీన్ లేదు అని అర్థం అయ్యింది’ అని బుద్ధా వెంకన్న అన్నారు.

అలాగే బుద్దా వేయించిన ఫ్లెక్సీని మార్ఫ్ చేసిన వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచేలా దాన్ని రూపొందిచారు. దీన్ని గమనించిన బుద్దా.. దానికి ఇటీవల విడుదలైన మహేశ్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’లోని డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ మార్ఫింగ్ ట్రిక్స్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్ అని కామెంట్ పెట్టిన ఆయన.. ఫేక్ , రియల్ ఫొటొలను పోస్ట్ చేశారు. వైఎస్ జగన్ దొంగ అయితే.. అంతకంటే పెద్ద దొంగలు తామని వైసీపీ కార్యకర్తలు నిరూపించుకుంటున్నారని విమర్శించారు. ఆయన వేసే ముష్టి 5 రూపాయిల కోసం ఎంతకైనా దిగజారుతున్నారని మండిపడ్డారు. ఆరోపణలు చేస్తే ఫర్వాలేదు కానీ.. ఇలాంటి చిల్లర పనులు చేయొద్దని సూచించారు. ఇదే కొనసాగితే జగన్ దొంగ బతుకు బయటపెడుతూనే ఉంటానని ట్వీట్ చేశారు.

ఇక చైర్మన్‌ ఆదేశాలను శాసనమండలి సెక్రటరీ అడ్డుకోలేరని, ఆయనకు ఎటువంటి అధికారాలు లేవని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సెలెక్ట్‌ కమిటీకి మండలిలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు పేర్లు పంపాలని చైర్మన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున సెక్రటరీ వాటిని కచ్చితంగా అమలు చేయాలని, లేదంటే సభా ధిక్కారం కిందకు వస్తుందని హెచ్చరించారు. నిబంధనలు పాటించకుంటే తర్వాత అధికారులే చిక్కుల్లో పడతారని స్పష్టం చేశారు.

 

Leave a Reply