విజయసాయికి బుద్దా కౌంటర్…250 ఇవ్వడానికి అంత అవసరమా?

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

అమరావతి: గ్రామ వలంటీర్లు అందరూ వైసీపీ కార్యకర్తలేనని సభాముఖంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. వలంటీర్లు అంటే ఉచితంగా సామాజిక సేవ చేయాలని వ్యాఖ్యానించారు. పెన్షన్ రూ.3 వేలు అని మోసం చేశారని, పెంచింది రూ.250 మాత్రమేనని మండిపడ్డారు. రూ.250 ఇచ్చేందుకు రూ.8 వేల జీతంతో మీ కార్యకర్తలను నియమించి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. తుగ్లక్ తో సరితూగే ఇంత చెత్త సీఎం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా దొరకడు అని ఎద్దేవా చేశారు.

అటు పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంపై టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు విమర్శలు చేశారు. పెన్షన్‌కు కరెంట్ బిల్‌కు లింకు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఎం జగన్ వెయ్యి రూపాయలున్న పెన్షన్‌ను రూ. 2,250 చేసినట్లు అసత్య ప్రచారం చేసుకుంటారా!? అని మండిపడ్డారు. చంద్రబాబు హయా్ంలో రూ. 2వేలు ఇచ్చిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలీదా? అని అన్నారు. ఒక్క రోజులో పెన్షన్ అని హడావుడి ఎందుకని, ఇంత ఆర్భాటం అవసరమా? అని ప్రశ్నించారు. పెన్షన్లు నాలుగు రోజులు లేట్ అయితే ఏమవుతుందన్నారు. పెన్షన్‌ల పంపిణీకి రూ. 1600 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.

ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్ వేదికగా లోకేశ్ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి చంద్రబాబు అధికారం పోయింది అని చిట్టినాయుడు సైకోపాత్ లా మారిపోయాడు అంటూ సెటైర్లు వేశారు.. చీకటిలో కూర్చొని అందరిపైకి రాళ్లు, పిడకలు విసురుతున్నారు అని.. మీడియా ముందుకు వచ్చి మాట్లాడు చిట్టి.. నీ కామెడీ కోసం అంత ఎదురు చూస్తున్నాం అని అన్నారు.

 

Leave a Reply